Warangalvoice

Controversy Over Jagadish Reddy Inappropriate Comments on Dalit Speaker in Telangana Assembly

TG Assembly: దళిత స్పీకర్‌పై జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు..

  • బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ మనస్తాపం చెందారు. దీంతో జగదీష్ రెడ్డి బే షరతుగా సభాపతికి క్షమాపణ చెప్పాలని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. స్పీకర్‌పై ఇంత అహంకారంగా మాట్లాడటం తాను ఎప్పుడూ చూడలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

వరంగల్ వాయిస్, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత (BRS Leader), మాజీ మంత్రి జగదీష్ రెడ్డి  అసెంబ్లీ లో చేసిన వ్యాఖ్యల పట్ల స్పీకర్  గడ్డం ప్రసాద్  మనస్తాపం చెందారు. ఈ క్రమంలో మంత్రులు సభాపతితో భేటి అయ్యారు. జగదీష్ రెడ్డి వ్యవహారంపై స్పీకర్‌తో చర్చిస్తున్నారు. జగదీష్ రెడ్డి బే షరతుగా క్షమాపణ చెప్పాలని అందరూ డిమాండ్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  మాట్లాడుతూ.. దళిత స్పీకర్‌పై జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. స్పీకర్‌పై ఇంత అహంకారంగా మాట్లాడటం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్యంలో స్పీకర్ చైర్‌కు కొన్ని అధికారాలు ఉంటాయని, దీనిపై సీరియస్ నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ అన్నారు.

జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు..

సభ మీ సొంతం కాదంటూ స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడడం రచ్చకు దారి తీసింది. జగదీష్ రె్డ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ రెడ్డి జోక్యం చేసుకుని జగదీష్ రెడ్డి స్పీకర్‌ను బెదిరిస్తున్నారని.. ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఏడాదిలో ఏం చేయాలో చేసి తమ సత్తా చూపించామన్నారు. ఏం చేయబోతున్నమో కూడా చెప్పామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

స్పీకర్‌పై అవిశ్వాసం పెడతాం.. హరీష్ రావు

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు అసెంబ్లీ లాబీలో చిట్ చాట్‌గా మాట్లాడారు. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకపోతే స్పీకర్‌పై అవిశ్వాసం పెడతామన్నారు. నిన్న ముఖ్యమంత్రి అక్షింతలు వేయడం.. ఈరోజు సభలో కాంగ్రెస్ సభ్యులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి స్పీకర్‌ను అవమానించలేదని, ‘సభ మీ ఒక్కరిదీ కాదు – సభ అందరదీ అని’ జగదీష్ రెడ్డి అన్నారని, మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం ఎలా అవుతుందని ప్రశ్నించారు. మీ ఒక్కరిదీ అనే పదం అన్ పార్లమెంటరీ పదం కాదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలీయదని.. సభను ఎందుకు వాయిదా వేశారో తెలీదని అన్నారు. కాంగ్రెస్ డిపెన్స్‌లో పడిందని, స్పీకర్‌ను కలిశామని, రికార్డు తీయాలని అడిగామన్నారు. దళితుడుని అగౌవరం పరిచే విధంగా జగదీష్ రెడ్డి మాట్లాడలేదన్నారు. 15 నిమిషాల అయినా వీడియో రికార్డు స్పీకర్ తెప్పించలేదని, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాట్లాడకుండా బ్లాక్ చేశారని హరీష్ రావు అన్నారు.

Controversy Over Jagadish Reddy Inappropriate Comments on Dalit Speaker in Telangana Assembly
Controversy Over Jagadish Reddy Inappropriate Comments on Dalit Speaker in Telangana Assembly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *