SIRICILLA | లక్ష్యం మేరకు యువ వికాస రుణాలను సకాలంలో పంపిణీ చేయాలి
సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజీవ్ యువ వికాసం పై బ్యాంకర్లతో సన్నాహక సమావేశం
వరంగల్ వాయిస్, సిరిసిల్ల కలెక్టరేట్ : యువ వికాసం అమలుకు ప్రతి బ్యాంకుకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలను సకాలంలో పంపిణీ చేయాలనీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ రాజీవ్ యువ వికాసం పై బ్యాంకర్ల తో సన్నాహక సమావేశం గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం క్రింద మంజూరు చేసే యూనిట్ లకు మున్సిపాలిటీ, మండలాల పరిధిలో ఉన్న బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించడం జరుగుతుందని, సబ్సిడీ మంజూరైన యూనిట్ లకు తప్పనిసరిగా బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేసి యూనిట్ గ్రౌండింగ్ లో బ్యాంకులు తమ సహకారం అందించాలని అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలన, తుది ఆమోదం సమయంలో బ్యాంకు బ్రాంచ్ మేనేజర...
