Warangalvoice

Tag: supreme court srilakshmi obulapuram mining case verdict

IAS Officer Srilakshmi: సుప్రీంలో శ్రీలక్ష్మికి చుక్కెదురు
Latest News

IAS Officer Srilakshmi: సుప్రీంలో శ్రీలక్ష్మికి చుక్కెదురు

వరంగల్ వాయిస్,  న్యూఢిల్లీ : ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి  సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓబుళాపురం అక్రమమైనింగ్ కేసులో ఆమెకు విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు  ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ప్రతివాదుల వాదనలను పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని సీబీఐ వాదనలు వినిపించింది. సీబీఐ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. మళ్లీ శ్రీలక్ష్మి కేసును తాజాగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోగా విచారణను ముగించాలని హైకోర్టును సుప్రీం ఆదేశించింది. వైఎస్సార్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్స్‌లో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలిగా ఐఏఎస్‌ అధికారిణిని శ్రీలక్ష్మి అరెస్ట్ అయి కొంత కాలం జైలు జీవితం కూడా అనుభవించారు. అయితే ఈకేసులో శ్రీలక్ష్మిపై నమోదు అయిన కేసును తెలం...