Jagadish Reddy | రాష్ట్ర ఆదాయాన్ని లూటీ చేసి ఢిల్లీకి మూటలుగా మోస్తున్నారు.. సీఎంపై జగదీష్ రెడ్డి ఫైర్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పాలన చేతగాని అసమర్థ సీఎం రేవంత్ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) వ్యాఖ్యానించారు. ఒక్క క్షణం కూడా సీఎంగా ఉండే అర్హత ఆయనకు లేదన్నారు. వెంటనే రాజీనామా చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
‘మొదటి నుంచి బీఆర్‌ఎస్ చెప్తున్న మాటలు నేడు నిజమని తేలిపోయాయి. ఓనమాలు రాని వాడు పదో తరగతి చదివనట్లుంది రేవంత్ తీరు. తెలంగాణ ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఢోకా లేదు. రేవంత్‌కి పరిపాలన చేతకావట్లేదనేది ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. అప్పులతో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ రెండున్నర లక్షల కోట్ల ఆదాయానికి తెచ్చారు. రాష్ట్ర ఆదాయం తగ్గి మంత్రుల ఆదాయం పెరగడంతోనే అసలు సమస్య వస్తోంది. మాఫియాలా ర...