Warangalvoice

SundarRaj

SundarRaj | బీసీ నాయకులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలి

  • బీసీల రాజకీయ పోస్టర్ ఆవిష్కరణ
  • మాజీ కూడా చైర్మన్, బీసీ నేత సుందర్ రాజు యాదవ్

వరంగల్ వాయిస్, భీమదేవరపల్లి : బీసీ నాయకులు ఐక్యంగా ఉండి మన హక్కులు సాదించుకోవాలని బీసీ నేత, మాజీ కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజు యాదవ్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలోని గ్రంథాలయంలో జాతీయ బీసీ నాయకులు మాజీ జడ్పీటీసీ వంగ రవి అధ్యక్షతన బీసీల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ నేత మాజీ కూడా చైర్మన్, సంగం రెడ్డి సుందర్ రాజు యాదవ్ హజరై మాట్లాడుతూ హనుమకొండ ఆర్ట్స్ అండ్ కాలేజీలో ఫిబ్రవరి 2 యుద్దభేరి తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయన్నారు. రానున్న రోజుల్లో ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీసీల జెండాలు ఏగిరే సమయం అసన్నమైందన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల నుండే బీసీలు రాజకీయ యుద్దం మొదలవుతుందన్నారు. ఫిబ్రవరి 2న జరిగే బీసీ రాజకీయ యుద్ధభేరి ప్రతి ఒక్కరు తన బాధ్యత గా బీసీ సభకు రావాలన్నారు. మండలం నుంచి పెద్ద ఎత్తున హజరై విజయవంతం చేయాలన్నారు. అనంతరం బీసీల రాజకీయ యుద్దబేరి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీసీ నాయకులు సంగం సంపత్ యాదవ్, సురేందర్, అశోక్, తిరుపతి, గద్ద సమ్మయ్య, పృథ్వీ రాజు, దోంగల కోంరయ్య, రవీందర్, పెద్ద ఎత్తున బీసీ నాయకులు పాల్గొన్నారు.

sundarraj 1 Sunder Raj Yadhav

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *