Warangalvoice

Sudhakar as TWJ Hanumakonda district president

టీయూడబ్ల్యూజే హనుమకొండ జిల్లా అధ్యకుడిగా సుధాకర్

వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (హెచ్-143) హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా మహా న్యూస్ సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ మస్కపురి సుధాకర్ ను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని యునియన్ సభ్యులందరితో సంప్రదించి ఈ నిర్ణయాన్ని వెల్లడించినట్టు తెలిపారు. గతంలో తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగిన సుధాకర్ ఇకపై హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతారని తెలిపారు. జిల్లాలో మెంబర్ షిప్ ప్రక్రియను పూర్తి చేసి పూర్తి స్థాయి కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామని వారు తెలిపారు.
యూనియన్ బలోపేతానికి కృషి: మస్కపురి సుధాకర్
తనపై నమ్మకంతో టీయూడబ్ల్యూ జే హెచ్ -143 హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ కు మస్కపురి సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ ఇస్మాయిల్, రమణ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ బీఆర్ లెనిన్, జాతీయ వ్యవహారాల ఇన్ చార్జ్ పీవీ కొండల్ రావు, రాష్ట్ర కార్యదర్శి తడక రాజనారాయణకు అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రాష్ట్ర కమిటీ బాధ్యులందరికి సుధాకర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలో యూనియన్ బలోపేతంతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని సుధాకర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *