- గొత్తికోయ గూడేన్ని సందర్శించిన డీఎస్పీ రాంమోహన్‌రెడ్డి
వరంగల్ వాయిస్, మహాముత్తారం : సమాజ శ్రేయస్సుకు హాని కలిగించే చట్ట వ్యతిరేక శక్తులకు దూరంగా ఉండాలని కాటారం డీఎస్పీ గడ్డం రాంమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని మద్దిమడుగు గొత్తికోయ గూడేన్ని కాటారం సీఐ రంజిత్‌రావుతో కలిసి సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గూడేంలో ఎవరైన కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీస్‌లకు సమాచారం అందించాలన్నారు. చట్టవ్యతిరేక సిద్ధాంతాలతో అడవుల్లో ఉండే మావోయిస్టులకు సహకరించొద్దని సూచించారు. గూడెంలోని పిల్లలను తప్పకుండా బడికి పంపించి విద్యానందించాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా పోలీసుల తమ దృష్టికి తీసుకురావాలని, చట్టపరిధిలో వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గూడెం వాసుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహాముత్తారం ఎస్సై సుధాకర్, సివిల్, సీఆర్‌పీఎఫ్ పోలీస్‌లు పాల్గొన్నారు.