- SpringSpree | వరంగల్ నిట్ స్ప్రింగ్ స్ప్రీ ఈవెంట్ 2025 కి ముస్తాబైంది. ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు మూడు రోజులపాటు ఈ సాంస్కృతిక మహోత్సవం జరగనుంది. గురువారం నిట్లో జరిగిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ బిద్యాధర్ సుబుది వివరాలను వెల్లడించారు.
వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్ నిట్ స్ప్రింగ్ స్ప్రీ ఈవెంట్ 2025 కి ముస్తాబైంది. ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు మూడు రోజులపాటు ఈ సాంస్కృతిక మహోత్సవం జరగనుంది. గురువారం నిట్లో జరిగిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ బిద్యాధర్ సుబుది వివరాలను వెల్లడించారు. సంగీతం, నృత్యం, కళలు, వినోదం వంటి రంగాల్లో ప్రతిభను వెలికి తీయడానికి వేదికగా స్ప్రింగ్ స్ప్రీ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
దేశంలోని ప్రముఖ కళాశాలల వార్షికోత్సవాల్లో ఒకటిగా వరంగల్ నిట్ పేరుగాంచింది. దేశవ్యాప్తంగా ఉన్న నిట్ కాలేజీల విద్యార్థులు ఈ మహోత్సవానికి హాజరవుతారని బిద్యాధర్ తెలిపారు. పోటీలు, వర్క్‌షాపులు, ప్రో షోలు, మ్యూజిక్ డీజేలు, బైక్ స్టంట్స్ లాంటి విభిన్న కార్యాక్రమాలు చేపట్టనున్నారు. అనేక కార్యక్రమాలతో స్ప్రింగ్ స్ర్పీ యువతలోని ప్రతిభను, సృజనాత్మకతను ప్రోత్సహించనుంది.
ఈ వేడుకలకు మరింత ఉత్సాహాన్ని జోడించేందుకు ప్రముఖ హాస్య నటుడు, పద్మశ్రీ బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. తన అమోఘమైన హాస్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న బ్రహ్మానందం స్ప్రింగ్ స్ప్రీ ఈవెంట్‌ను ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ తెలిపారు.
