Warangalvoice

Ex Minister Harish Rao Team Protest At Slbc After Police Stopped Their Team

SLBC | ఎస్ఎల్‌బీసీ వ‌ద్ద‌కు చేరుకున్న హ‌రీశ్‌రావు.. ట‌న్నెల్ లోప‌లికి అనుమ‌తించ‌ని పోలీసులు

  • SLBC | ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు వ‌ద్ద‌కు మాజీ మంత్రులు హ‌రీశ్‌రావు, జ‌గ‌దీశ్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గువ్వ‌ల బాల‌రాజు, బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు చేరుకున్నారు.

వరంగల్ వాయిస్,  మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు వ‌ద్ద‌కు మాజీ మంత్రులు హ‌రీశ్‌రావు, జ‌గ‌దీశ్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గువ్వ‌ల బాల‌రాజు, బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు చేరుకున్నారు. అయితే సొరంగంలోకి వెళ్ల‌నీయ‌కుండా హ‌రీశ్‌రావు బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హ‌రీశ్‌రావు, ఇత‌ర నాయ‌కులు రోడ్డుపైనే బైఠాయించిన నిర‌స‌న తెలిపారు. పోలీసుల తీరుపై హ‌రీశ్‌రావు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఎస్ఎల్‌బీసీ ప్ర‌మాద ఘ‌ట‌న‌ను ప‌రిశీలించేందుకు మాజీ మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, న‌ల్ల‌గొండ జిల్లాల‌కు చెందిన బీఆర్ఎస్ నేత‌లు హైద‌రాబాద్ నుంచి ఇవాళ ఉద‌యం బ‌య‌ల్దేరిన సంగ‌తి తెలిసిందే. క‌ల్వ‌కుర్తిలో బీఆర్ఎస్ నేత‌ల‌తో క‌లిసి హ‌రీశ్‌రావు టీ తాగారు. అనంత‌రం అక్క‌డ్నుంచి నేరుగా ఎస్ఎల్బీసీ సొరంగం వ‌ద్ద‌కు చేరుకున్న‌ప్ప‌టికీ.. లోప‌లికి పోలీసులు అనుమ‌తించ‌డం లేదు. భారీగా పోలీసులు మోహ‌రించారు. మీడియాపై కూడా పోలీసులు ఆంక్ష‌లు విధించారు.

Ex Minister Harish Rao Team Protest At Slbc After Police Stopped Their Team
Ex Minister Harish Rao Team Protest At Slbc After Police Stopped Their Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *