Warangalvoice

Asi Attempt To Theft Locals Caught And Beat Him

Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్‌ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి

  • ఆయనో ఏఎస్‌ఐ. నెలనెలా మంచి జీతం. అయినా ఖర్చులకు డబ్బులు సరిపోతలేవేమో.. ఓ ఇంట్లో చోరీకి యత్నించాడు. ఎంతైనా ప్రొఫెషనల్‌ దొంగ కాదుకదా..! దొరికిపోయాడు. ఇంకేముంది జనం ఊరికే ఉంటారా.. చితకబాది పోలీసులకు అప్పగించారు. తారా అతడు కూడా ఓ పోలీసు అని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు.

వరంగల్ వాయిస్,  సిరిసిల్ల రూరల్ : ఆయనో ఏఎస్‌ఐ. నెలనెలా మంచి జీతం. అయినా ఖర్చులకు డబ్బులు సరిపోతలేవేమో.. ఓ ఇంట్లో చోరీకి యత్నించాడు. ఎంతైనా ప్రొఫెషనల్‌ దొంగ కాదుకదా..! దొరికిపోయాడు. ఇంకేముంది జనం ఊరికే ఉంటారా.. చితకబాది పోలీసులకు అప్పగించారు. తారా అతడు కూడా ఓ పోలీసు అని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు.

మహేశ్‌ అనే వ్యక్తి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల  మున్సిపల్ పరిధిలోని సర్థపూర్‌లో ఉన్న 17వ పోలీస్ బెటాలియన్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. అక్కడే ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. అయితే కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు తెలుస్తున్నది. దీంతో సోమవారం రాత్రి పట్టణంలోని ఓ ఇంట్లో దూరి, చోరీకి యత్నించాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్నవారికి పట్టుబడ్డాడు. దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామని సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ తెలిపారు.

Asi Attempt To Theft Locals Caught And Beat Him
Asi Attempt To Theft Locals Caught And Beat Him

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *