వరంగల్ వాయిస్, కాజీపేట : స్థానికి డీజిల్ కాలనీలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శనివారం రోజున స్వయం పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో ఉ త్తమంగా బోధించిన పలువురు విద్యార్థులకు ప్రిన్సిపాల్ శీరీష బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ షరీఫ్, ప్రిన్సిపాల్ శీరిష, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
