- SC Reservations | ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజకీయాలకు అతీతంగా ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా ఎస్సీ కేటగిరికి చెందిన ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు. ఇక 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరిస్తూ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. గ్రూప్-1లోని అత్యంత వెనుకబడిన 15 కులాలకు ఒక శాతం రిజర్వేషన్, మాదిగలున్న గ్రూప్-2లోని కులాలకు 9 శాతం రిజర్వేషన్లు, మాలలు ఉన్న గ్రూప్-3లోని కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
