
- సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కపూర్‌లో దారుణం చోటుచేసుకున్నది. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. సుభాష్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి మల్కపూర్‌లో నివాసం ఉంటున్నాడు.
వరంగల్ వాయిస్, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కపూర్‌లో దారుణం చోటుచేసుకున్నది. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. సుభాష్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి మల్కపూర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతని భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన సుభాష్.. తన ఇద్దరు పిల్లలు మారిన్ (13), ఆరాధ్య (10) ఉరివేసి చంపేశాడు.
అనంతరం తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘనటా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
