Warangalvoice

Brs Leader Rs Praveen Kumar Gave Warning To Congress Party Social Media

RSP | చిల్ల‌ర వేషాలు మానుకోక‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటా.. కాంగ్రెస్ సోష‌ల్ మీడియాకు ఆర్ఎస్పీ వార్నింగ్

  • RSP | కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియాపై బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నా రాజకీయ భవిష్యత్‌పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని స్ప‌ష్టం చేశారు.

వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియాపై బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నా రాజకీయ భవిష్యత్‌పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని స్ప‌ష్టం చేశారు. ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాన‌ని ఆర్ఎస్పీ హెచ్చ‌రించారు.

నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో, ఏ వర్గాల భవిష్యత్‌ కోసం పనిచేయాల్నో నాకు క్లారిటీ ఉంద‌ని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తెలిపారు. మీ లాగా పదవులకోసం ఢిల్లీకి మూటలు మోసే సంస్కృతి నాకు లేదు. అన్ని పైసలు కూడా నా దగ్గర లేవు. తెలంగాణలో తరతరాలుగా అణచివేతకు గురైన వర్గాల విముక్తికి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ స‌రైన వేదిక అని బ‌లంగా న‌మ్మి ముందుకు వెళ్తున్నాన‌ని పేర్కొన్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్, కేటీఆర్, హ‌రీశ్‌రావు ప్రోత్సాహంతో తెలంగాణ 2.0ను ఎలా సృష్టించాలన్న పనిలో బిజీగా ఉన్నాన‌ని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ పేర్కొన్నారు.

Brs Leader Rs Praveen Kumar Gave Warning To Congress Party Social Media
Brs Leader Rs Praveen Kumar Gave Warning To Congress Party Social Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *