- Radhakishan Bail Hearing: తెలంగాణ హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి విచారణ జరిగింది. ఫోన్ ట్యాపింగ్‌పై పంజాగుట్టలో నమోదైన రెండో ఎఫ్‌ఐఆర్‌పై ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని రాధాకిషన్ రావు వేసిన పిటిషన్‌పైన సుదీర్ఘ వాదనల తర్వాత నేడు వాదనలు ముగిశాయి.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసుపై (Phone Tapping Case) తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) విచారణ జరిగింది. ముందస్తు బెయిల్ కోరుతూ రాధాకిషన్ రావు (Radhakishan Rao) దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు వాయిదా వేసింది. గతంలో చక్రధర్‌గౌడ్ ఫిర్యాదుతో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్‌పై పంజాగుట్టలో నమోదైన రెండో ఎఫ్‌ఐఆర్‌పై ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని రాధాకిషన్ రావు వేసిన పిటిషన్‌పైన సుదీర్ఘ వాదనల తర్వాత ఈరోజు వాదనలు ముగిశాయి.
తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది. చక్రధర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాధాకిషన్‌రావుతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురిపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ రాధాకిషన్ రావు తన వాదనలు వినిపించారు. కానీ ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఈ కేసులో విచారణ జరపాలని, చాలా ఆధారాలను సేకరించాల్సి ఉంటుందని, కీలక అంశాలు వెలుగులోకి రావాలని ఈ క్రమంలో రాధాకిషన్‌కు బెయిల్ ఇవ్వొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది.
ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు మొదటి ఎఫ్‌ఐఆర్‌లో జ్యుడిషియల్ రిమాండ్ నుంచి కొద్దిరోజుల క్రితమే రాధాకిషన్ బెయిల్‌పై బయటకు వచ్చారు. దీంతో రెండో కేసుకు సంబంధించి తనకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు పూర్తి కాగా.. న్యాయస్థానం తీర్పు ఎలా ఉండబోతంది అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
