వరంగల్ వాయిస్, హనుమకొండ: ఆబోప , వరంగల్ దర్శన్ చానల్ సంయుక్త ఆధ్వర్యంలో మాజీ ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు పై రూపొందించిన పి.వి.సంక్షిప్త జీవిత చరిత్ర -2022″ పి.వి.స్మారక అవార్డు ప్రదానోత్సవ సభ ఆడియో విజువల్ ను వరంగల్ దర్శన్ స్టూడియోలో ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా పి.వి.తనయుడు పి.వి.గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పి.వి.ప్రభాకర్ రావు విచ్చేసి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో అతిథులుగా పి.వి.ప్రభాకర్ రావు, సుడా చైర్మన్ జి.వి.రామకృష్టారావు, మాజీ శాసనమండలి సభ్యుడు నారదాసు లక్ష్మణరావు, ఎల్లరెడ్డి పేట ఎమ్మెల్యే సురేందర్, ఆబోప అధ్యక్షుడు మోత్కూరు మనోహర్ రావు, వరంగల్ దర్శన్ చైర్మన్ పెండెంరమేశ్ బాబు, డా. పాలకుర్తి దినకర్ సభలో ఆసీనులై పి.వి.దేశానికి చేసిన సేవలను కొనియాడారు . చక్కని ఆడియో విజువల్ రూపొందించిన వరంగల్ దర్శన్ ఎం.డి ప్రసాదరెడ్డిని అతిథులు అభినందించారు. సభలో పింగళి వెంకటెశ్వర్ రావు, పి.వి.మదన్ మోహన్ టి.నరేందర్, పి.వేణుమాధవ్, దేవులపల్లి శ్రీకాంత్, పెండెం శ్రీనివాసరావు, డా.వొడితల పవన్, తనుగుల జితేందర్ రావు సుదర్శన్ రావు, రామలింగేశ్వర్ రావు, వెంకట్ దేవులపల్లి వాణి, మోత్కూరు ఇందిర దేవి, వరంగల్ దర్శన్ సిబ్బంది తదితరులు పాల్గన్నారు. అతిథులను ఆబోప, వరంగల్ దర్శన్ అధ్యక్షుడు పెండెం రమేశ్ బాబు, మోత్కూరు మనోహర్ రావు ఘనంగా సన్మానించారు.
