- పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలి
- బీజేపీ, టీఆర్ ఎస్ దొందుదొందే
- కాంగ్రెస్ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాయిని
- హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా
వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: నిత్యావసర, పెట్రో, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ వరంగల్ , హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర సరుకుల ధరలను, పెట్రోల్, డీజిల్ ధరలను, గ్యాస్ ధరలను తగ్గించాలని ఉప్పులు, పప్పులపై, పాలపై విధించిన జీఎస్టీని వేసి పేదల నడ్డి విరుస్తున్న ఈ ప్రభుత్వాలు వెంటనే అధిక ధరలను, తగ్గించి జీఎస్టీని ఎత్తివేయాలని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిరాశ్రయులైన వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏటూరునాగారం, మంగపేట, భద్రాద్రి కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో వరద బాధితులను కలిసిన సీఎం కేసీఆర్ నామమాత్రపు ప్రకటనలు చేసి.. ఢిల్లీకి వెళ్లి ఏం సాధించు కొచ్చారో చెప్పాలన్నారు. బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబంపై ఈడీ పేరుతో మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చేయడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నిన్నటి వరకు ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ నేడు కేంద్ర ప్రభుత్వంపై కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చి రోడ్లపై నిరసనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఏఐసీసీ పిలుపుమేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉద్యమాలు కొనసాగిస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, తోట వెంకన్న, పెరుమాండ్ల రామకృష్ణ, మహమ్మద్ అయూబ్, అనిల్ కుమార్, అజీజ్ ,బంక సంపత్, కూర వెంకట్, మహమ్మద్ అంకుస్ కొత్తపల్లి శ్రీనివాస్, మీసాల ప్రకాష్ , తవుటం రవీందర్, దేశిని ఐలయ్య, అంబేద్కర్ రాజు, విక్రమ్, పులి రాజు,రాహుల్ రెడ్డి, కార్తీక్ ,సతీష్ ,భారతమ్మ డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.