Warangalvoice

cannabis

256కిలోల గంజాయి స్వాధీనం

  • ముగ్గురు నిందితుల అరెస్ట్

వరంగల్ వాయిస్, క్రైం: ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు భారీ స్థాయిలో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు గంజాయి స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ , హసన్ పర్తి పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు 38 లక్షల రూపాయల విలువగల గంజాయితో పాటు గంజాయి తరలిస్తున్న కారును, ఒక మోటార్ సైకిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ కు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి సోమవారం వెల్లడించారు.. కామారెడ్డి జిల్లాకి చెందిన పల్లపు రాజు , పల్లపు రాజు, బోడ సుమన్ అనే ముగ్గురు 4 సంవత్సరాలుగా భద్రాచలం, డొంకరాయి, సీలేరు, ధారకొండ ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలలో వారి ట్రాక్టర్ తో భూమిని చదును చేసేందుకు పనికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం జనవరిలో సత్తి బాబుకి చెందిన భూమి అల్లురికోట ఒడిషా రాష్ట్రంలో రూ.70,000 లకు కుదుర్చుకొని అతడి భూమిని చదును చేశారు. భూమి చదును చేసిన తరువాత సత్తి బాబు నిందితులకు డబ్బులు ఇవ్వకుండా 70, 000 లకీ బదులు గంజాయి ఇస్తానని, ఇంకా ఒక లక్షా రూపాయలు ఇస్తే ఇంకా ఎక్కువ మొత్తంలో గంజాయి ఇస్తా అని, దీనిని అమ్మడం ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని వారికి ఆశ చూపించాడు. నిందితులు కూడా ఒప్పందం కుదుర్చుకొని లక్ష రూపాయలు ఇచ్చి 256 కిలోల గంజాయిని సత్తి బాబు, ప్రతాప్ అనే వ్యక్తులు సమకూర్చి నిందితుల కారులో లోడ్ చేశారు. తర్వాత నిందితులు అల్లురికోట, ఒడిషా రాష్ట్రం నుంచి మహారాష్ట్ర వరకు తమ కారు లో బయల్దేరారు. వీరికి ఎస్కార్ట్ గా పల్లపు రాజు తన మోటార్ సైకిల్ పై వెళ్లాడు.. వీరు హసన్ పర్తి చెరువు కట్టకి రాగానే, పోలీసులకి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు వాహన తనిఖీలో 256 కిలోల గంజాయిని గుర్తించిన పోలీసులు ముగ్గురు నిందితులును అరెస్ట్ చేసి విచారించగా గంజాయి రవాణాకు పాల్పడుతున్నట్లుగా అంగీకరించారు.

cannabis
Possession of 256 kg of cannabis

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *