- సంతోషాల నడుమ వేడుకలు
- వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
వరంగల్ వాయిస్, క్రైం : సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రజలకు సూచించారు. ప్రశాంతవంతమైన వాతవరణంలో ఎలాంటి ఆవాంనీయ సంఘటనలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు పలుసూచనలు చేస్తూ సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సర వేడుకలను ఆర్థరాత్రి 12.30 గంటల లోపు ముగించుకోవాల్సి ఉంటుందన్నారు. సంస్కృతిక కార్యక్రమాల నిర్వహకులు తప్పని సరిగా పోలీసులనుంచి ముందస్తూ అనుమతులు తీసుకోవాలన్నారు. వేడుకలు నిర్వహించే ప్రాంతంలో ఎలాంటి అశ్లీల నృత్యాలకు తావులేదన్నారు. అలాగే కార్యక్రమాల నిర్వహణ ప్రదేశంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలతోపాటు సెక్యూరిటీ సిబ్బందిని ఎర్పాటు చేసుకోవాలన్నారు. వేడుకల సమయంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా, చుట్టు పక్కల వారికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
వేడుకల్లో ఎలాంటి మత్తు పదార్థాలు వినియోగించరాదన్నారు. వేడుకల వేళ యువకులు మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే జరిమానతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు. అలాగే వేగంగా వాహనాలు నడపడం, రోడ్లుపై వెళ్ళేవారిని ఇబ్బందికి గురిచేయడం తగదన్నారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా ట్రాఫిక్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసుల అధ్వర్యంలో ట్రై సిటీతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోను ముమ్మరంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. పై అంక్షలను ఎవరైనా అతిక్రమిస్తే డయల్ 100 నంబర్‌కు సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వేడుకలను ప్రజలు, యువత తమ ఇంటిలోనే కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతరణంలో నిర్వహించుకోవడం శుభ పరిణామం అన్నారు.
#New Year’s Eve 2025 #Celebrations # Police Commissioner
# Warangal # Guidelines #Restrictions # Drunk driving
#Public celebrations #Law and order
Headlines:
- Warangal Police Commissioner Issues Guidelines for a Safe New Year’s Eve
- New Year’s Eve Restrictions Announced in Warangal
- Police Crackdown on Drunk Driving During New Year Celebrations
- Warangal Police Urge Residents to Celebrate New Year’s Eve Safely at Home