- పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌడమ్మ తల్లికి కవిత బోనం సమర్పించారు.
వరంగల్ వాయిస్, సూర్యాపేట : పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌడమ్మ తల్లికి కవిత బోనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. బోనం ఎత్తుకుని ఆలయం వద్దకు చేరుకున్న కవితకు పూజారులు ఘనస్వాగతం పలికారు. పూజల అనంతరం ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు లింగమంతుల జాతర శుభాకాంక్షలు. స్వామివారికి బోనం చెల్లిండం నా అదృష్టంగా భావిస్తున్నాను. సముక్క సారక్క జాతర తరువాత రెండో అతి పెద్ద జాతర లింగమంతుల జాతర. తెలంగాణ రాష్ట్ర సంప్రదాయం, సంస్కృతికి లింగమంతుల జాతర నిదర్శనం. కేసీఆర్ హయాంలో జాతరకు రూ.14 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాం. ఈ ప్రభుత్వం కూడా సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాం అని కవిత పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితతో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు.
