Warangalvoice

Pavan Kalyan

Pavan Kalyan | కోటి రూపాయలు అడిగినా ఇస్తాను, కాని అవి మాత్రం ఇవ్వను

వరంగల్ వాయిస్, సినిమా : విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో 35వ బుక్‌ ఫెస్టివల్‌ ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ బుక్‌ ఫెస్టివల్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జనవరి 2న సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. 234 స్టాళ్లతో అనేకమంది ప్రచురణకర్తలు ఈ మహోత్సవంలో పాల్గొననున్నారు. సాహితీ నవజీవన్‌ బుక్‌ లింక్స్‌ అధినేత పిడికిలి రామకోటేశ్వరరావు పేరును ఈ బుక్‌ ఫెస్టివల్‌ ప్రాంగణానికి పెట్టారు. ప్రధాన సాహితీవేదికకు ఈనాడు అధినేత దివంగత రామోజీరావు పేరు పెట్టారు. విద్యార్థుల కార్యక్రమాలు జరిగే ప్రతిభా వేదికకు దివంగత పారిశ్రామిక వేత్త రతన్‌ టాటాపేరు పెట్టారు. ఈ పుస్తక మహోత్సవం 2వ తేదీనుంచి 12వ తేదీ వరకు జరుగనున్నాయి. అయితే ఈ బుక్‌ ఫెస్టివల్‌లో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. కోటి రూపాయలు అయిన ఇవ్వడానికి వెనుకాడను కానీ నా దగ్గర పుస్తకాలు ఉన్న ఇవ్వడానికి ఆలోచిస్తాను. పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నా సంపదను ఇచ్చినట్లే అని నాకు అనిపిస్తుంది. కర్ణుడు కవచ కుండలాలను కోసేస్తే ఎలా బాధ పడుతాడో తెలీదు కానీ.. నా పుస్తకం ఇవ్వాలంటే కింద, మీద పడిపోతాను అంత మమకారం పుస్తకాలు అంటే అని పవన్‌ చెప్పుకోచ్చాడు. పుస్తక పఠనం లేకపోతే నేను ఏలా ఉండేవాడినో అనిపిస్తది. నేను ఇంటర్‌ కూడా ఎందుకు ఆపేశాను అంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో, క్లాస్‌ రూంలో లేదు అందుకే ఇంటర్‌ ఆపేశాను. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్కూలుకి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని చదువుకున్నాడు.. నేను ఠాగూర్‌ గారి ప్రేరణతో ఆయన లాగే చెట్లు, మొక్కలు చూస్తూ పుస్తకాలు పెట్టుకొని ఉండిపోయాను అంటూ పవన్‌ కళ్యాణ్‌ చెప్పుకోచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *