Warangalvoice

Ou Jac Students Met Professor Haragopal For Cancle To Ou Circular

OU Circular | ఓయూ సర్క్యులర్ రద్దుకు మద్దతు ఇవ్వండి.. ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్‌కు విజ్ఞ‌ప్తి

  • ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని రకాల ఆందోళనలు, నిరసనలను నిషేధిస్తూ జారీ చేసిన సర్కులర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని విద్యార్థి నేతలు విజ్ఞప్తి చేశారు.

వరంగల్ వాయిస్, ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని రకాల ఆందోళనలు, నిరసనలను నిషేధిస్తూ జారీ చేసిన సర్కులర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని విద్యార్థి నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్‌లను కలిసి పరిస్థితిని వివరించారు.

అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా జారీ చేసిన సర్క్యులర్‌ను తక్షణమే ఉపసంహరించుకునే విధంగా ప్రభుత్వం.. ఓయూ అధికారులతో మాట్లాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు నాగేశ్వరరావు, జంగిలి దర్శన్, కాసర్ల మధు, వలిగొండ నరసింహ, జంగయ్య, మహేష్, నవీన్, రుద్రవరం మధు, సైదులు, వంశీ, రుక్మత్ పాషా, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Ou Jac Students Met Professor Haragopal For Cancle To Ou Circular
Ou Jac Students Met Professor Haragopal For Cancle To Ou Circular

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *