- Osmania University | ఉస్మానియా యూనివర్సిటీకి రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 1000 కోట్ల నిధులను కేటాయించాలని జార్జి రెడ్డి పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
వరంగల్ వాయిస్, ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీకి రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 1000 కోట్ల నిధులను కేటాయించాలని జార్జి రెడ్డి పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓయూ విద్యార్థులకు సీఎం ఫెలోషిప్ పథకం ప్రకటించాలని కోరారు. ఓయూ విద్యార్థులకు ఉచిత మెస్ వసతితో పాటు, ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. వర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయాలని అన్నారు.
బడ్జెట్‌లో విద్యారంగానికి 30 శాతం నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. విద్యా సంస్థల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలు, యూనివర్సిటీల అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్న యూనివర్సిటీల అభివృద్ధికి ఆశించిన స్థాయిలో నిధులు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జార్జి రెడ్డి పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమంత్, గర్ల్స్ కన్వీనర్ స్వాతి, నాయకులు వెంకటేష్, అంజి, క్రాంతి, విజయ్, తిరుపతి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
