- వక్ఫ్ బిల్లును పార్లమెంట్‌లో అమోదించడంతో ముస్లిం వర్గాల్లో భిన్నాభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
వరంగల్ వాయిస్, చార్మినార్ : వక్ఫ్ బిల్లును పార్లమెంట్‌లో అమోదించడంతో ముస్లిం వర్గాల్లో భిన్నాభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదించి రాష్ట్రపతి భవన్‌కు చేరిన పక్షంలో ఇక రాజ్యాంగబద్దంగా అమలు కావడమే తరువాయి. ప్రస్తుతం లోక్‌సభ, రాజ్యసభల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు మెజారిటీ సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేసి బిల్లు సవరణకు మద్దతు పలికారు. ఈ క్రమంలో ముస్లింలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు స్వాగతిస్తే.. మరికొందరు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
ఈ క్రమంలో పాతనగరంలోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పుల కొనసాగుతుంది. శుక్రవారం ప్రత్యేక ప్రార్ధనల నేపథ్యంలో సున్నిత, అతి సున్నిత ప్రాంతాలుగా గుర్తించిన చోట్ల పోలీస్ ఉన్నతధికారులు పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది అంతర్గతంగా అందించిన నివేదికల ప్రకారం చార్మినార్, మక్కా మసీదు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ప్రత్యేక ప్రార్ధనల సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు, ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు వాహనాలను, సిబ్బందిని సిద్ధం చేశారు. నగర్ జాయింట్ సీపీ విక్రమ్ సింగ్ మాన్‌తోపాటు దక్షిణ మండల డీసీపీ స్నేహ మెహ్రా, అదనపు డీసీపీ జావీద్‌లు బందోబస్తును పర్యవేక్షించారు.
