- MLC Kavitha | జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు.
వరంగల్ వాయిస్, ఉస్మానియా యూనివర్సిటీ : జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ మార్గదర్శకత్వంలో కవితక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మిలియన్ మార్చ్, నిరాహార దీక్షలు, సకల జనుల సమ్మె, రైలు రోకో, బతుకమ్మ పండుగ, సడక్ బంద్ తదితర ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలను చైతన్య పరుస్తూ, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగను వ్యాపింప చేసిన ఘనత ఆమెకే దక్కుతుందని కొనియాడారు.
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణంలో కీలకపాత్ర వహించి తెలంగాణ సమస్యలపై పార్లమెంటులో గళమెత్తారని అన్నారు. మహిళలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేసి మహిళల కోసం ఎన్నో పోరాటాలు చేసి రిజర్వేషన్లు సాధించిన గొప్ప నాయకురాలని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఇచ్చిన హామీలపై 14 నెలలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి బీసీల హక్కుల కోసం ప్రభుత్వాన్ని నిలదీశారు అని చెప్పారు. బీసీల కోసం ఇందిరాపార్క్ దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహించి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయాలలో 42% రిజర్వేషన్ కల్పించాలని పోరాటం చేసి కాంగ్రెస్ మెడలు వంచిందని కీర్తించారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
