- Nizamabad | ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం నిరాశ కలిగించిందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో నుడా చైర్మన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
వరంగల్ వాయిస్, కంఠేశ్వర్ : ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం నిరాశ కలిగించిందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో నుడా చైర్మన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం అన్ని విధాలుగా అభివృద్ధి చేసినప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించడం నిరాశకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక 56 వేల ఉద్యోగాలు ఇచ్చినా పట్టభద్రులు ఎందుకు ఓటు వేయలేరో అని అనుమానం వ్యక్తం చేశారు.
ప్రమోషన్లు, బదిలీలు లేక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ల సమస్యలను తీర్చిందని మానాల మోహన్ రెడ్డి తెలిపారు. అయినప్పటికీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకపోవడం నిరాశ పరిచిందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ కలిసి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు .ఇంకా ఎక్కువగా కష్టపడి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు వైపు ముందడుగు వేస్తామని తెలిపారు.
