వరంగల్ వాయిస్, కేపీహెచ్‌బీ కాలనీ : కూకట్‌పల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన దాసాంజనేయ స్వామి దేవాలయంలో ముందు భాగంలో ఏర్పాటు చేసిన రేకుల షెడ్డును ఇవాళ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కురుమయ్య గారి నవీన్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూకట్‌పల్లి ప్రాంతంలోని పురాతన ఆలయాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రామాలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామని భవిష్యత్తులో అన్ని ఆలయాలు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కురుమయ్య గారి కొండలరావు, గొట్టిముక్కల వెంగళరావు, వడ్డేపల్లి రాజేశ్వరరావు, ఆలయ కమిటీ చైర్మన్ తులసి రావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, దేవస్థాన కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
