వరంగల్ వాయిస్, యాదాద్రి భువనగిరి : బీఆర్ఎస్ వరంగల్ సభ తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రజతోత్సవ సభ విజయవంతం కోసం యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలోని మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి యాదాద్రి ఆలయం వరకు బీఆర్ఎస్‌వీ విద్యార్థులు పాదయాత్ర చేపట్టారు.
ఈ పాదయాత్రను ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. వరంగల్ సభ చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుంది. సబ్బండ వర్గాలు కదిలివస్తున్నాయ్. వరంగల్ సభ ఓ రేంజ్‌లో ఉంటుంది. బీఆర్ఎస్ ఏది చేసినా సంచలనమే. వరంగల్ సభ కూడా అలానే ఉంటుంది. ఇవ్వాళ అందరిలో చైత్యనాన్ని స్పూర్తిని నింపేలా బీఆర్ఎస్‌వీ విద్యార్థులు పాదయాత్ర చేపట్టారు. ఇవ్వాళ ప్రజలకు కష్టం వస్తే మా కేసీఆర్ ఉంటే బాగుండు అని అంటున్నారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు. ప్రతి రైతు మనసులో కేసీఆర్ వున్నారు అని జగదీశ్ రెడ్డి తెలిపారు.
గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు కనబడితే తన్ని తరిమేసే రోజులు వచ్చాయి. ఎక్కడికక్కడ ప్రజలను పీక్కోని తింటూ కాంగ్రెస్ నాయకులు బలిచారు. మంత్రులు అయితే కమిషన్లు తింటున్నారు. ప్రజల సొమ్మును, ప్రభుత్వం సొమ్మును దోచుకొని తింటున్నారు ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, పార్టీ రాష్ట్ర నాయకులు గొంగిడి మహేందర్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
