- Minority Leaders Protest | మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వనందుకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద సోమవారం మైనార్టీ నాయకులు నిరసన చేపట్టారు.
వరంగల్ వాయిస్, కంటేశ్వర్ : మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వనందుకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద సోమవారం మైనార్టీ నాయకులు నిరసన చేపట్టారు. శాసనమండలి ఎన్నికల అభ్యర్థుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మైనార్టీలు నిరసన తెలిపారు. కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్‌గా ఉన్న షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ స్పందించి షబ్బీర్‌కు టికెట్ కేటాయించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ కానున్న 5 స్థానాల్లో కాంగ్రెస్ తరుఫున ముగ్గురి పేర్లను అధిష్టానం ప్రకటించింది. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటాలో అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఖరారు చేసింది. మరొక సీట్‌ను వామపక్షానికి కేటాయించింది. అయితే మైనారిటీ కోటాలో మొండి చేయి చూపారని మైనార్టీలు ఆందోళన వ్యక్తం చేశారు.
