- Minister Seethakka: కాంగ్రెస్ ఇచ్చిన షోకాజు నోటీసులు తీసుకున్న తాను బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సంచలన వాఖ్యలు చేశారు. అయితే మల్లన్నపై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు
వరంగల్ వాయిస్, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లన్న వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లన్నకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కార్యకర్తల శ్రమతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కొందరు నేతలు బీజేపీ, బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ చేయలేనిది తాము చేశామని.. అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పొల్చుకునే స్థాయి మల్లన్నది కాదని చెప్పారు. కులగణనపై అభ్యంతరాలు ఉంటే శానసనమండలిలో మాట్లాడాలని అన్నారు. కులగణనకు 50 రోజుల సమయం ఇచ్చామని.. అది సరిపోదా అని మంత్రి సీతక్క నిలదీశారు.
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై ఫైర్
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న వ్యాఖ్యలను ఖండించారు. తన ఓటమికి సీఎం రేవంత్ రెడ్డి కారణం అంటూ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కేవలం తన ఉనికి కోసమే అని చెప్పారు. తాను మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలన్నది అధిష్ఠానం నిర్ణయమని తెలిపారు. తన గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎంతో శ్రమించారని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగానే మహబూబ్ నగర్‌లో బీజేపీ గెలిచిందని అన్నారు. ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉండటంతో ఆమెను బయటకు తీసుకు రావడం కోసం బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అమ్ముడుపోయిందని ఆరోపించారు. గతంలో కేసీఆర్ లాంటి నేతలు ఎంపీగా పని చేసిన మహబూబ్‌నగర్ సిట్టింగ్ సీట్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయి బీజేపీకి మద్దతు ఇచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ తన గెలుపు కోసం సమష్టిగా కృషి చేశారని వంశీ చంద్ రెడ్డి పేర్కొన్నారు.
