Warangalvoice

Maganti Gopinath Health Condition Serious.. joins private hospital in Hyderabad

Maganti Gopinath : ఎమ్మెల్యేకి తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక

  • Maganti Gopinath : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. గత కొంత కాలంగా మాగంటి గోపినాథ్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. గత నాలుగు రోజుల క్రితం ఆ సమస్య మరింత తీవ్రం కావడంతో.. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు.

వరంగల్ వాయిస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆయన్ని నగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యాన్ని వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. గత కొంత కాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజుల క్రితం ఈ సమస్య మరింత పెరిగింది. దీంతో కుటుంబ సభ్యులు.. ఆయన్ని ఆగమేగాల మీద ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకొంటున్నారు. 2023 ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ టీడీపీ టికెట్‌పై గెలుపొందారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన నాటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నాటి నుంచి ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతోన్నారు. 2019 ఎన్నికల్లో సైతం జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన విషయం విధితమే.

Maganti Gopinath Health Condition Serious.. joins private hospital in Hyderabad
Maganti Gopinath Health Condition Serious.. joins private hospital in Hyderabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *