Warangalvoice

Senior Leader Madhu Yaskhi Goud Sensational Comments On Congress Party

Madhu Yaskhi Goud | కాంగ్రెస్ పార్టీలో రెడ్ల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోరు.. మధుయాష్కీ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

  • Madhu Yaskhi Goud | కాంగ్రెస్ పార్టీపై సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్లు, అగ్రకులాల వాళ్లు ఎలాంటి క్రమశిక్షణ ఉల్లంఘన పనులు చేసినా చర్యలు తీసుకోరు అని మ‌ధుయాష్కీ తెలిపారు.

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీపై సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్లు, అగ్రకులాల వాళ్లు ఎలాంటి క్రమశిక్షణ ఉల్లంఘన పనులు చేసినా చర్యలు తీసుకోరు అని మ‌ధుయాష్కీ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డే క్రమశిక్షణ తప్పాడని ఆయ‌న పేర్కొన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే మేఘా రెడ్డిపై బహిరంగంగా ఆరోపణలు చేశాడు.. మరి క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిపై క్రమశిక్షణ చర్యలు ఉండవా? అని ప్ర‌శ్నించారు. కులగణన మీద బీసీ నాయకులతో రేవంత్ రెడ్డి మీటింగ్ పెడితే దానికి జానారెడ్డిని, కేశవరావును పిలిచారు కానీ బీసీ నాయకుడినైనా నన్ను పిలవలేదు అని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను ఇటీవ‌లే స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. రాహుల్ గాంధీ ఆదేశాల మేర‌కే పార్టీ నుంచి ఎమ్మెల్సీ మ‌ల్ల‌న్న‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ప‌లు స‌భ‌ల్లో రెడ్ల‌ను తీన్మార్ మ‌ల్ల‌న్న బ‌హిరంగంగా విమ‌ర్శించిన నేప‌థ్యంలోనే ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన‌ట్లు రాజ‌కీయ నిపుణులు పేర్కొన్నారు. పార్టీ వ్య‌తిరేక కార్యక‌లాపాల‌కు పాల్ప‌డినందుకే స‌స్పెండ్ చేసిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ సంఘం తెలిపింది.

Senior Leader Madhu Yaskhi Goud Sensational Comments On Congress Party
Senior Leader Madhu Yaskhi Goud Sensational Comments On Congress Party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *