వరంగల్ వాయిస్, మధిర : అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇల్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు పాగి బాలస్వామి, రామోజీ యోగేశ్ అన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో, రాజీవ్ యువ వికాసంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలన్నారు. అనంతరం తొలి సభ్యత్వాన్ని సీనియర్ జర్నలిస్టులు అట్లూరి సాంబిరెడ్డి, కొంగర మురళి చేతుల మీదగా జర్నలిస్టులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రావిరాల శశి కుమార్, మువ్వా మురళి, మక్కెన నాగేశ్వరరావు, కిలారి కిశోర్, నాళ్ల శ్రీనివాసరావు, కాకరపర్తి శ్రీనివాసరావు, పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు, సుంకర సీతారాములు, చల్లా శ్రీనివాసరెడ్డి, మువ్వా రామకృష్ణ, రావూరి కృష్ణ ప్రసాద్, దుబాసి రాజేశ్, రాము, మధు, పల్లబోతు ప్రసాదరావు, వేముల నవీన్, కొంగల విజయ్, పసుపులేటి ఈశ్వర్ రవితేజ, ఆదూరి విజయ్ రాజు, లిక్కి రవీంద్ర, చారుగుండ్ల లక్ష్మీ, నరసింహమూర్తి, తలారి రమేశ్, పగిడిపల్లి ప్రభాకర్, కంచపోగు కోటేశ్వరావు, వేల్పుల పవన్, దోర్నాల కృష్ణ, సంతోష్ పాల్గొన్నారు.
