- వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి
- రెడ్ క్రాస్ లో పోలీసుల ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం
వరంగల్ వాయిస్, క్రైం: యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవితకాలాన్ని పెంచాలని పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి యువతకు పిలుపునిచ్చారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాధితులకు కోసం హన్మకొండ రెడ్ క్రాస్ పిలుపునందుకోని హనుమకొండ డివిజినల్ పోలీసుల ఆధ్వర్యంలో సుబేదారిలోని రెడ్ క్రాస్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతతో పాటు పోలీస్ సిబ్బంది, అధికారులు సైతం స్వచ్ఛందంగా రక్తదానం చేయడంలో వారిని ప్రోత్సహించే విధంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఈ శిబిరం ముందుగా రక్తదానం చేసి యువతకు అదర్శంగా నిలిచారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా రక్తదాతలకు సర్టిఫికేట్లను అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ విజయ్ చందర్ రెడ్డి, రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక వర్గ సభ్యులు ఈ.వి. శ్రీనివాస్,జిల్లా పాలక సభ్యులు పాపిరెడ్డి,సుబేదారి, కేయూసీ ఇన్ స్పెక్టర్లు రాఘవేందర్, దయాకర్ , ఎస్.ఐలు ఉమ, రాజ్ కుమార్,రమేష్,నినీష రెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది, యువత పాల్గొన్నారు.
ఎస్సై పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు..
తెలంగాణ పోలీస్ శాఖలో భర్తీ చేయనున్న సబ్-ఇన్ స్పెక్టర్ల ఉద్యోగాలకు నిర్వహించనున్న ఆర్హత రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాటు చేయాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి సూచించారు. ఈ నెల 7వ తేదీన నిర్వహింబడే ఎస్.ఐ ఆర్హత రాత పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై సన్నాహక సమావేశాన్ని సోమవారం కాజీపేటలోని నిట్ కళాశాలలోని సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేయడంతో పాటు ఇన్విజిలేటర్లకు బయోమెట్రిక్ శిక్షణ అందజేశారు. ఆర్హత రాత పరీక్షకు 21,550 మంది అభ్యర్థులు హాజరవుతుండగా ఇందుకోసం మొత్తం 42 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో వరంగల్ జిల్లా పరిధిలో 20, హనుమకొండ జిల్లా 16, జనగామ జిల్లా 6 కేంద్రాలు వున్నాయన్నారు. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు బయోమెట్రిక్ విధానం ద్వారా వేలి ముద్రలు తీసుకోనే విధంగా సిబ్బందికి శిక్షణ అందజేశామన్నారు. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సమయానికి ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి రావల్సి వుంటుందని,పరీక్షకు సంబంధించి నియమ నిబంధనలు హాల్ టికెట్ లో పొందుపరిచి వుంటాయన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ వైభవ్ గైఖ్వాడ్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల రిజనల్ కో ఆర్డినేటర్లు డా. చంద్రమౌళి,. అనంద్ కోలా, నర్సయ్య, ఏసీపీ ప్రతాప్ కుమార్, వెంకటరెడ్డితో ఐటీకోర్ సిబ్బంది పాల్గొన్నారు.
సమయపాలన పాటించాలి..
మద్యం దుకాణాలు, బార్ షాపులు సమయపాలన పాటింకుంటే చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మద్యం వ్యాపారులను హెచ్చరించారు. మద్యం వ్యాపారులు సమయపాలనతో ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించకుండా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్‌కు ప్రజల నుంచి పలు ఫిర్యాదులు రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సెంట్రల్ పరిధిలోని మద్యం వ్యాపారులతో పోలీస్ కమిషనర్ సోమవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి మద్యం దుకాణాం లేదా బార్లలో వచ్చిపోయే మార్గలతో పాటు, సిటింగ్ రూంల్లోను తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, టాఫ్రిక్ ఇబ్బంది కలగకుండా మద్యం దుకాణాల ముందుగా వాహనా పార్కింగ్ క్రమబద్ధీకరణ చేయాల్సి వుంటుందన్నారు. సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్, అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, ప్రొబెషనరీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఏసీపీలు గిరికుమార్, కిరణ్ కుమార్ తో పాటు ఇన్ స్పెక్టర్లు, ఎక్సైజ్ అధికారులు, మద్యం వ్యాపారులు పాల్గొన్నారు.

