వరంగల్ వాయిస్, ములుగు : ములుగు జిల్లాలో సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో లాయర్‌ను దారుణంగా హత్య చేశారు. ములుగు జిల్లా కేంద్రానికి 11 కిలోమీటర్ల దూరంలోని పందికుంట బస్టాఫ్ వద్ద ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. హత్యకు గురైన వ్యక్తి న్యాయవాది మల్లారెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఎర్ర మట్టి క్వారీ.…భూ తగాదాలు.. పాత కక్షలే కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
