- KTR | రేవంత్ రెడ్డికి స్వార్థం తప్ప ఇంకోటి తెలియదు.. రియల్ ఎస్టేట్ తప్ప.. స్టేట్ ఫికర్ లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆమన్‌గల్‌లో ఏర్పాటు చేసిన రైతు దీక్షలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : రేవంత్ రెడ్డికి స్వార్థం తప్ప ఇంకోటి తెలియదు.. రియల్ ఎస్టేట్ తప్ప.. స్టేట్ ఫికర్ లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆమన్‌గల్‌లో ఏర్పాటు చేసిన రైతు దీక్షలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. అన్నదాతలు, మహిళలు జాగ్రత్తగా, చైతన్యవంతంగా ఉండాలి. నాగర్‌కర్నూల్ జిల్లాలో రుణమాఫీ కాక చందు అనే రైతు బ్యాంక్ ముందు బైక్ కాలబెట్టి నిరసన చెప్పిండు. ఆదిలాబాద్‌లో జాదవ్ రావు అనే రైతు బ్యాంకులోనే ఎండ్రిన్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్‌లో సురేంద్ రెడ్డి అనే రైతు వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే సూసైడ్ చేసుకున్నాడు. చివరకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ వేణోగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దరిద్రపు పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. దయచేసి మళ్లీ మోసపోవద్దు అని కేటీఆర్ సూచించారు. మళ్లీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. ఎకరం, అర ఎకరానికి పైసలు వేస్తుండు. ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది ఒక్కొక్క ఎకరానికి రూ. 17500. మళ్లా నమ్మి మోసపోతే.. మనల్ని ఎవరు కాపాడలేదు. పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఇంటికొచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టి అడగండి.. రైతు బంధు, తులం బంగారం, 2500 ఎక్కడా అని అడగాలి.. స్కూటీలు ఏమైనయ్ అని ప్రశ్నించాలి. స్కూటీలు లేవు కానీ లూటీ మాత్రం బాగా నడుస్తుంది. తుక్కుగూడ నుంచి ఇక్కడి దాకా.. రేవంత్ రెడ్డి ఆయన సోదరులు ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీ.. ఏఐ సిటీ అని డ్రామా చేస్తుండ్రు. వెల్దండ వద్ద రేవంత్ కుటుంబానికి 500 ఎకరాలు ఉండే. మళ్లా 1000 ఎకరాలు సంపాదించిండు. మళ్లీ కొత్త కథ పెట్టిండు.. అత్తగారి ఊరికి కొత్త రోడ్డు వేసుకుంటడ. 1200 ఎకరాల రేట్లు పెంచుకునేందుకు కథలు పడుతుండు రేవంత్ రెడ్డి.. ఆయనకు స్వార్థం, తప్ప ఇంకోటి తెలియదు. రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ ఫికర్ లేదు. ఇలాంటి రేవంత్ రెడ్డిని అసలు నమ్మకండి అని కేటీఆర్ సూచించారు. బిల్లులు రాక సర్పంచ్‌లు ఆగం అవుతున్నారు. వారి గోస పుచ్చుకుంటున్నడు రేవంత్ రెడ్డి. సచివాలయం చుట్టూ తిప్పించుకునంటున్నడు. 600 కోట్ల ఇస్తే అయిపోతది. పాడి రైతులు ఇప్పటి వరకు పైసల్లేవు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నయ్ అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు.
