- KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికకు ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. మల్కపేట రిజర్వాయర్‌కు సాగునీరు విడుదల చేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికకు ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. మల్కపేట రిజర్వాయర్‌కు సాగునీరు విడుదల చేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
48 గంటల్లో నీళ్లు విడుదల చేసి పంటలకు సాగునీరు అందించకపోతే, మంత్రి ఉత్తమ్ కుమార్ చాంబర్ ఎదుట ధర్నా చేస్తామని కేటీఆర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. కేటీఆర్ హెచ్చరించడంతో యంత్రాంగం కదిలింది. మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్‌లోకి నీటి విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. బోయినపల్లి మండలంలోని మిడ్ మానేర్ నుంచి ఈ రోజు 0.5 టీఎంసీ నీటి విడుదలకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నీరు మల్కపేట రిజర్వాయర్‌కు చేరుకున్న వెంటనే, దీని పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని మైసమ్మ చెరువు, సింగసముద్రం చెరువులకు చేరనున్నాయి.
