- KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సూచనతో అధికారులు కదిలారు.
వరంగల్ వాయిస్, సిరిసిల్ల : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సూచనతో అధికారులు కదిలారు. నిన్న సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్‌ను రంగనాయక సాగర్ నుంచి నీళ్లు ఇప్పించాలని తంగళ్లపల్లి మండలంలోని జిల్లెళ్ల, నేరెళ్ల, చిన్న లింగాపూర్, రామచంద్రపురం, దాచారం రైతులు కోరిన విషయం తెలిసిందే. స్పందించిన కేటీఆర్ ఎస్ఈతో ఫోన్‌లో మాట్లాడి నీళ్లు అందివ్వాలని సూచించారు. దీంతో సోమవారం జక్కాపూర్‌లోని రంగనాయక సాగర్ కాల్వను ఎస్ఈ రవీందర్, అధికారులు తంగళ్లపల్లి మండలంలో రైతులుతో కలిసి సందర్శించారు. కాలువను పరిశీలించి నీటి సరఫరా చేస్తామని, నీటి ఫ్లో కూడా పెంచుతామని పేర్కొన్నారు.
రంగనాయక సాగర్ కాల్వ నుంచి జిల్లెళ్ల వరకు నీటి సరఫరా చేస్తామని, కాలువలో భూములు కోల్పోయిన రైతులకు, పెండింగ్‌లో ఉన్న భూ పరిహారం రూ.55 లక్షలు రైతులకు త్వరలోనే అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రంగనాయక సార్ కాలువ ద్వారా అందరికీ సమానంగా నీటి సరఫరా చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు తంగళ్లపల్లి మండలంలోని రైతులు కృతజ్ఞతలు తెలిపారు. వీరిలో మాజీ సర్పంచ్ మాట్ల మధు, మాజీ సింగిల్ విండో చైర్మన్ పబ్బతి విజయేందర్ రెడ్డి, సతీష్ రెడ్డి, ఏనుగు రాజేశ్వరరావు, రైతులు ఉన్నారు.
