- రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోవడంపై రేవంత్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామంటారు, అధికారం దక్కాక ఆదాయం కోసం ఎల్ఆర్ఎస్ ముద్దు అంటారని మండిపడ్డారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోవడంపై రేవంత్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామంటారు, అధికారం దక్కాక ఆదాయం కోసం ఎల్ఆర్ఎస్ ముద్దు అంటారని మండిపడ్డారు. హైడ్రా, ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్‌లో అరాచకం సృష్టించారని విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చివేశారని మండిపడ్డారు. ఫలితంగా రిజిస్ట్రేషన్లు పాతాళానికి పడిపోయాని ధ్వజమెత్తారు. ఆదాయం అడుగంటడంతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలో లక్షన్నర కోట్ల అప్పులు చేశారని, హామీల అమలు మాత్రం గాల్లో కలిసిపోయిందని మిమర్శించారు. కాంగ్రెస్ 15 నెలల పాలన నిర్వాకం మూలంగా రియల్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు గారడీలో సామాన్యులే సమిధలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
