కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం
వరంగల్ వాయిస్, రేగొండ: ప్రతి ఏటా శ్రావణ మాసంలో కొడవటంచ ఆలయంలో సుప్రసిద్ధ శ్రీలక్ష్మీ నరసింహస్వామి జన్మదిన స్వాతి నక్షత్రమైన శుక్రవారం కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్, ఆలయ చైర్మన్ మాదాడి అనిత కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉదయం 11.00 నుంచి సామూహిక వరలక్ష్మి వ్రతాలలో 20 జంటలు, సామూహిక కుంకుమార్చనలలో 45 జంటలు పాల్గొనడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ధర్మకర్తలు గుర్రాల శ్రీనివాస్ రెడ్డి దంపతులు, శెట్టి విజయ, ఆలయ డైరెక్టర్ పోగు సుమన్, గండి తిరుపతి గౌడ్, స్థానిక సర్పంచ్ పబ్బ శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ పున్నం లక్ష్మి-రవి దంపతులు, ఆలయ సిబ్బంది కొమ్మురాజు రవి, గోరంట్ల శ్రావణ్,సుధాకర్, రవి , గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
