Warangalvoice

kcr said Once Again Our party is win in telangana elections

KCR: మళ్లీ మనదే అధికారం.. కష్టపడి పనిచేయాలి

  • బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సీఎంపై ప్రజల్లో ఇంత తొందరగా వ్యతిరేకత వస్తుందనుకోలేదని ఎద్దేవా చేశారు. ఇంకా ఏం అన్నారనే విషయాలను ఇక్కడ చూద్దాం.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తాజాగా జరిగిన బీఆర్ఎస్ (భారతీయ రాష్ట్ర సమితి) నేతల విస్తృతస్థాయి సమావేశంలో కమ్యూనిస్టులపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కమ్యూనిస్టులు అధికార పార్టీతో అనుసంధానమై, ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యతను విస్మరించి కాంగ్రెస్‌కు తొత్తులుగా మారిపోయారని ఆరోపించారు. అంతేకాదు ఈ సమావేశంలో కేసీఆర్, తెలుగుదేశం పార్టీ (TDP) ప్రాస్థానం గురించి కూడా మాట్లాడారు. ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు) పడిన కష్టనష్టాలను వివరించారు. టీడీపీ ఎన్టీఆర్ కాలంలో ఉన్న పరిస్థితులను గుర్తుచేశారు.

ప్రజల్లో వ్యతిరేకత

ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి పాలనపై ప్రజలలో వ్యతిరేకత పెరుగుతున్న విధానంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీఎంపై ఇంత తొందరగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనుకోలేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం ప్రతి సంవత్సరం పెరుగుతుందని చెప్పారు. కానీ ప్రస్తుతం మాత్రం ప్రభుత్వంలో రాష్ట్ర ఆదాయం పడిపోతుందని ఆరోపించారు. అదే అధికారులు ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి చేయించుకోవడం రావడం లేదని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఆయన యువ నేతలకు కష్టపడి పనిచేయాలని సూచించారు.

ఉపఎన్నికలపై సూచనలు

ఈ క్రమంలో రాష్ట్రంలో త్వరలో ఉపఎన్నికలు వస్తాయని, అందుకు సంబంధించి పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. మళ్లీ మనదే అధికారమని, మీరే ఎమ్మెల్యేలు అవుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కేసీఆర్, టీడీపీ పార్టీ ప్రాస్థానం, కష్టనష్టాలు, ఎన్టీఆర్ కాలం గురించి వివరిస్తూ, ప్రజల మద్దతు పొందేందుకు పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠను పెంచాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కమ్యూనిస్టులపై చేసిన విమర్శలు, టీడీపీ ప్రస్తావనతోపాటు సీఎంపై వ్యతిరేకత అంశం వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి

kcr said Once Again Our party is win in telangana elections
kcr said Once Again Our party is win in telangana elections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *