Warangalvoice

Brslp Meeting By Kcr In Telangana Bhavan

KCR | బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం ప్రారంభం

  • KCR | బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యంలో తెలంగాణభవన్‌లో పార్టీ శాసనసభాపక్షం సమావేశం ప్రారంభ‌మైంది.

వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యంలో తెలంగాణభవన్‌లో పార్టీ శాసనసభాపక్షం సమావేశం ప్రారంభ‌మైంది. ఈ స‌మావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు.

బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తున్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లపై బిల్లులు ప్రవేశపెట్టాలని ఈ నెల 6న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వాటిపై తీసుకున్న చర్యలపై కేసీఆర్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు వివరించి, అందుకు అనువైన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ, తదితర అంశాలపై కూడా మార్గనిర్దేశం చేయనున్నారు.

Brslp Meeting By Kcr In Telangana Bhavan
Brslp Meeting By Kcr In Telangana Bhavan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *