- KCR | తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముగిసింది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం మూడు గంటలకు పైగా కొనసాగింది.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముగిసింది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం మూడు గంటలకు పైగా కొనసాగింది. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అందరం కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కృషి చేద్దామని కేసీఆర్ సూచించారు. అసెంబ్లీ సమావేశాలకు నేను కూడా వస్తున్నానని పార్టీ ప్రతినిధులతో కేసీఆర్ అన్నారు. రేపట్నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
