- మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని సురంగల్ గ్రామంలో పెద్ద చెరువు కట్టమైసమ్మ దేవాలయం పునఃప్రతిష్టాపన ద్వితీయ వార్షిక మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు.
వరంగల్ వాయిస్, మొయినాబాద్ : మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని సురంగల్ గ్రామంలో పెద్ద చెరువు కట్టమైసమ్మ దేవాలయం పునఃప్రతిష్టాపన ద్వితీయ వార్షిక మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని పునఃప్రతిష్టాపన చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో ఏడాదిలోనికి అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారికి అర్చన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వేదపండితులతో శత సప్త చండీయాగం నిర్వహించారు.
అనంతరం మహిళలతో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని కన్నుల విందుగా నిర్వహించారు. వార్షికోవత్సంలో పాల్గొన్న భక్తులకు అన్నదానం నిర్వహించారు. హోమం కార్యక్రమాన్ని ఆదాయ పన్ను శాఖ మాజీ అధికారి రాములు, కె మల్లేశ్ గౌడ్ దంపతుల చేతులు మీదుగా నిర్వహించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త జైపాల్‌రెడ్డి, ఆలయ నిర్వాహకులు కె మల్లేశ్ గౌడ్, జి నర్సింహ్మరెడ్డి, మాజీ సర్పంచ్ ఏ లావణ్య భాస్కరాచారి, మాజీ ఎంపీటీసీ ఈగ రమాదేవి రవీందర్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ గడ్డం అంజిరెడ్డి, మాజీ వార్డు సభ్యులు గడ్డం వెంకట్‌రెడ్డి, నిర్డుల మహేందర్‌రెడ్డి, మల్లేశ్, మైసయ్య, జి మహేందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు కొంగరి నర్సింహ్మరెడ్డి, పెద్ద వెంకట్‌రెడ్డి, భాస్కరా చారి,ఈగ రవీందర్‌రెడ్డి, పోతుల ప్రభు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
