Warangalvoice

Inter District Thief Arrested In Metpally

Karimnagar | అంతర్ జిల్లా ఘరానా దొంగ అరెస్ట్.. రూ.11 లక్షల విలువగల సొత్తు స్వాధీనం

  • తాళం వేసిన ఇండ్లనే టార్గెట్‌గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ఘరానా దొంగ మిట్టపల్లి లక్ష్మణ్‌ను మల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.

వరంగల్ వాయిస్, మెటపల్లి : తాళం వేసిన ఇండ్లనే టార్గెట్‌గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ఘరానా దొంగ  మిట్టపల్లి లక్ష్మణ్‌ను మల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం మెటపల్లి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నిరంజన్ రెడ్డి వివరాలను వెల్లడించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన మిట్టపల్లి లక్ష్మణ్ అలియాస్ రవి అలియాస్ విజయ్(28) అను అతను నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాలో దొంగతనాలకు పాల్పడ్డాడు. వివిధ పోలీస్ స్టేషన్స్‌ పరిధిలో ఇప్పటి వరకు 40 కేసులు నమోదవగా పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. గత కొంతకాలంగా మెటపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో తాళం వేసిన ఇళ్లలో వరుసగా దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో మల్లాపూర్ ఎస్‌ఐ రాజు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం ముత్యంపేట నిజాం చెక్కర ఫ్యాక్టరీ సమీపంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా మోటార్ సైకిల్ పై వస్తున్న అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలింది. నిందితుడిని అరెస్టు చేసి రూ.11 లక్షల విలువగల 103 గ్రాముల బంగారం 125.3 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. దొంగను చాకచక్యంగా పట్టుకొని సొత్తును రికవరీ చేసిన మల్లాపూర్ ఎస్ఐ రాజు, పోలీస్‌ సిబ్బందిని డీఎస్పీ రాములు అభినందించారు.

Inter District Thief Arrested In Metpally
Inter District Thief Arrested In Metpally

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *