Warangalvoice

Protest Demanding Compensation For Displaced People

Kaleshwaram Canal : భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాల‌ని ధ‌ర్నా

  • యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా రాజాపేట‌ మండలంలోని బేగంపేట గ్రామ‌ రైతుల నుంచి కాళేశ్వరం కాల్వ పనులకు కోసం సేకరించిన భూమికి వెంట‌నే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం తాసీల్దార్ కార్యాలయం ముందు బాధితులు ధర్నా నిర్వహించారు.

వరంగల్ వాయిస్, రాజాపేట : యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా రాజాపేట‌ మండలంలోని బేగంపేట గ్రామ‌ రైతుల నుంచి కాళేశ్వరం కాల్వ పనులకు కోసం సేకరించిన భూమికి వెంట‌నే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం తాసీల్దార్ కార్యాలయం ముందు బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి చిగుళ్ల లింగం మాట్లాడుతూ.. సేకరించిన రైతుల భూములు ధరణి నుంచి తొలగిపోయి రైతు భరోసా కూడా రాక రైతులు తీవ్రంగా నష్ట పోతున్న‌ట్లు తెలిపారు.

పరిహారం చెల్లించకుండానే ధరణి ఆన్‌లైన్‌లో నుంచి రైతుల పేర్లు తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని తాసిల్దార్ అనితకు వినతి పత్రాన్ని అందజేశారు. నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్‌, ఎర్రగోకుల జశ్వంత్ మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
Protest Demanding Compensation For Displaced People
Protest Demanding Compensation For Displaced People

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *