వరంగల్ వాయిస్, రామగిరి : మంథని జేఎన్టీయూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధులు బహిష్కరించి గురువారం ఆందోళన చేపట్టారు. స్టేట్ అసోసిఅషన్ ఫర్ కాంట్రాక్టు టీచర్స్ పిలుపు మేరకు హైయర్ ఎడ్యూకేషన్ కౌన్సిల్ వద్ద సమస్యలు విన్నవించడానికి జీవో 21కు వ్యతిరకంగా శాంతియుత నిరసన చేపట్టడానికి వెళ్లిన రాష్ట్రం లోని 12 విశ్వవిద్యాలయాలకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల అక్రమ అరెస్ట్, ప్రత్యేకంగా మహిళా కాంట్రాక్టు అధ్యాపకుల పట్ల పోలీసుల ప్రవర్తించిన తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసోసియేషన్ విద్యా సంస్థలు బందుకు పిలుపునిచ్చారు.
కాగా ఈ పిలుపులో భాగంగా జేఎన్టీయూహెచ్ అనుబంధ కాలేజీ అయిన మంథని కాలేజీకి చెందిన సహాయ ఆచార్యులు బంద్ లో పాల్గొన్నట్లు కాంట్రాక్ట్ అధ్యాపకులు తెలిపారు.
