- Harish Rao | ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిత్యం ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిత్యం ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఏదో ఒక రకంగా హరీశ్‌రావుపై కేసులు నమోదు చేస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తుంది రేవంత్ సర్కార్. తాజాగా హరీశ్‌రావుపై మరో కేసు నమోదైంది. మాజీ మంత్రి హరీశ్‌రావుపై చక్రధర్ గౌడ్ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. హరీశ్‌రావుపై 351(2), ఆర్‌డబ్ల్యూ3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హరీశ్‌రావుతో పాటు సంతోష్ కుమార్, రాములు, వంశీపై కేసు నమోదైంది.
