Warangalvoice

Brs Leader Harish Rao Slams Congress Government And Cm Revanth Reddy For Urea Shortage In Telangana

Harish Rao | దేశానికి అన్నం పెట్టే రైతన్నతో కన్నీళ్లు పెట్టిస్తున్నారు.. కాంగ్రెస్‌ పాలనపై హరీశ్‌రావు విమర్శలు

  • Harish Rao | కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. మొన్న మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే.. నేడు జగిత్యాలలో రైతులు పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టిన పరిస్థితి నెలకొందని తెలిపారు.

Harish Rao | కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. మొన్న మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే.. నేడు జగిత్యాలలో రైతులు పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని రైతుల కన్నీళ్ల కడగండ్లను కాంగ్రెస్‌ సర్కార్‌ పునరావృతం చేస్తున్నదని మండిపడ్డారు.

బీఆర్ఎస్ పాలనలో రైతే రాజుగా ఉన్న తెలంగాణలో రైతన్నను నట్టేట ముంచి, నడి రోడ్డు మీదకు తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని హరీశ్‌రావు విమర్శించారు. రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. యూరియా కోసం రైతులు మండుటెండల్లో తంటాలు పడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతు డిక్లరేషన్ అని దగా చేసి, రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ పేరుతో మోసం చేశారని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్‌రావు మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను కంట నీరు పెట్టిస్తున్నరని అన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతాంగానికి అవసరమైన యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

Brs Leader Harish Rao Slams Congress Government And Cm Revanth Reddy For Urea Shortage In Telangana
Brs Leader Harish Rao Slams Congress Government And Cm Revanth Reddy For Urea Shortage In Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *