- Harish Rao | జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి.. జాబ్ లెస్ క్యాలెండర్ చేశారని హరీశ్‌రావు విమర్శించారు. నిరుద్యోగ భృతి ఊసే లేదని.. ఏటా 2లక్షల ఉద్యోగాలని యువతను మోసం చేశారన్నారు. కృష్ణా జలాల గురించి గొప్పలు చెబుతున్నారని, కృష్ణా జలాలు ఆంధ్రా దోచుకుపోతుంటే మౌనంగా ఉన్న మీరు దాని గురించి మాట్లాడటం సిగ్గుచేటరన్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : హరీశ్‌రావు జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి.. జాబ్ లెస్ క్యాలెండర్ చేశారని హరీశ్‌రావు విమర్శించారు. నిరుద్యోగ భృతి ఊసే లేదని.. ఏటా 2లక్షల ఉద్యోగాలని యువతను మోసం చేశారన్నారు. కృష్ణా జలాల గురించి గొప్పలు చెబుతున్నారని, కృష్ణా జలాలు ఆంధ్రా దోచుకుపోతుంటే మౌనంగా ఉన్న మీరు దాని గురించి మాట్లాడటం సిగ్గుచేటరన్నారు. ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి మొదటి హామీ నెలకు రూ.2500 ఇప్పటికి దిక్కులేదని.. ఇంకా దీన్ని గేమ్ ఛేంజర్ అని చెప్పుకుంటున్నారన్నారు. ఎస్‌జీహెచ్‌లకు ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదన్నారు. 55వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెప్పారని.. పదివేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. విద్యావ్యవస్థ నిర్వీర్యం చేశారని.. గురుకులాల్లో 83 మంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారని చెప్పారు.
ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదని, పోలీసు భద్రత అమలు కావడం లేదని.. గొప్పలు మాత్రం చెప్పుకుంటున్నారని విమర్శించారు. సామాజిక న్యాయం.. బీసీలకు న్యాయం కోసం 42శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం బిల్లు పెడుతున్నారన్నారు. బీసీల కులగణన తప్పుల తడకగా చేసి.. ఇప్పుడు ఏ ప్రాతిపదికన బిల్లు పెడతారని ప్రశ్నించారు. తప్పుల కులగణన చేసిన రోజును సామాజిక న్యాయ దినోత్సవంగా ఎలా జరుపుతారన్నారు. కనీసం అంబేద్కర్ విగ్రహానికి దండ కూడా వేయని వాళ్లు సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుతారా? అంటూ నిలదీశారు. కుల సర్వే చేసినం అంటున్నారని.. ఆ సంఖ్య మీద బీసీ సంఘాలే అనుమానం వ్యక్తం చేస్తున్నాయని గుర్తు చేశారు. ప్రశ్నించిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తప్ప, వాస్తవ లెక్కలు బయటికి చెప్పడం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసి ఉద్యోగ నియమకాలు పూర్తి చేస్తమని ఇదే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటించాడని.. ఇప్పటికీ ఒక్క అడుగు ముందు పడలేదన్నారు.
పెట్టుబడులు, పరిశ్రమలు వాపస్ పోతుంటే సిగ్గులేకుండా గొప్పలు చెబుతున్నారని, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రాకు తెలంగాణకు వచ్చిన పరిశ్రమలు తరలిపోతున్నాయని మీడియా కోడై కూస్తుందని, లక్షా78వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గొప్పలు చెబుతున్నారన్నారు. అసలు దావోస్‌లో జరిగే ఒప్పందాలు ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటెంట్ అని మీ ఉప ముఖ్యమంత్రి చెప్పిండని.. ఇప్పటి వరకు మీరు చెప్పిన ఒప్పందాలు ఎన్ని గ్రౌండ్ అయ్యాయని.. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎంఎస్ఎంఈలు ఇబ్బందులు పడుతుంటే.. కొత్త పాలసీ అని డబ్బా కొడుతున్నారని.. పోలీసు ఫ్యామిలీలు రోడ్డు ఎక్కాయని.. అయినా పోలీసు సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నమని డబ్బా కొట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై పొగడ్తలతో గుదిగుచ్చి తయారుచేసిన ప్రసంగం ఇదని.. పాడిందే పాటరా అన్న చందంగా ఏడాది కాలంగా చెప్తున్నవే మళ్లీ మళ్లీ చెప్పి.. చెప్పించిన నిస్సారమైన ప్రసంగం అంటూ విమర్శించారు.
